ఆర్థిక ఫలితాలు కీలకం.. పశ్చిమాసియా సంక్షోభంపైనా మదుపర్ల నజర్
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
దేశీయ స్టాక్ మార్కెట్లు పడుతూ.. లేస్తూ సాగుతున్నాయి. అయినప్పటికీ అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,256.94 పాయింట్లు లేదా 3.11 శాతం ఎగిసి 74,729.27 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 625.70 పాయింట్లు లేదా 2.77 శాతం పెరిగి 23,146.15 దగ్గర ఆగింది. ఇక ఈ వారం విషయానికొస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) ద్వితీయ త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు కీలకం కానున్నాయి. దేశీయ ఐటీ రంగ సంస్థలు ఆశాజనక ఫలితాలను నమోదు చేస్తుండటం మార్కెట్…
అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో దిగొస్తున్న ముడి చమురు ధరలు, ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోల్చితే బలపడుతున్న రూపాయి మారకం విలువ.. స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లకు మద్దతిచ్చే వీలుందనే చెప్పవచ్చు. కానీ పశ్చిమాసియా సంక్షోభంతో క్రూడాయిల్ రేట్లు ఇంకా పెరిగితే సూచీలు నష్టాలకు లోనుకావచ్చు. తగ్గితే మదుపర్లు పెట్టుబడులకు మొగ్గుచూపుతారు. విదేశీ మదుపర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ఎల్ నినో సంబంధిత సమాచారం కూడా మార్కెట్ కదలికల్ని ప్రభావితం చేయగలవు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం.. మార్కెట్ పెట్టుబడులను గట్టిగానే ప్రభావితం చేయగలవని చెప్పవచ్చు. ఇక అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/business/stock-market-outlook-sensex-and-nifty-rise-as-investors-watch-q2-earnings-2539784
framing not published · 1 outlet covered this story, below the floor for a split