అబ్బబ్బ పులుపు.. అయినా తినుము!
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
కొంతమంది గ్రహరాశుల గమనాన్ని గణించి కాలాన్ని కొలిస్తే.. సామాన్యుడు మార్కెట్లోని ఫలరాశులు చూసి కాలాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు మార్కెట్లలో ఉన్న ఉసిరి, సీతాఫలం, జామ పండ్ల రాశులు శీతాకాలం వచ్చిందని చెబుతున్నాయి. కాలాన్ని బట్టి ప్రకృతి ఇచ్చే ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుసు. కానీ, ఫ్లూ జ్వరాలకు భయపడి ‘అబ్బబ్బ పులుపు… తిననే తినను’ అనేవాళ్లున్నారు. ఎందుకు తినరంటే.. పులుపు తింటే జలుబు చేస్తుందని సమాధానం చెబుతూ ఉంటారు. ఇది నిజం కాదు. కానీ, ఎక్కువ మంది జనం నమ్ముతున్నారు. కారణం శీతాకాలానికి ముందు ఈ పుల్లని ఉసిరి, నిమ్మ, నారింజ మారెట్లోకి అడుగుపెడతాయి.
ఇదే కాలంలో చల్లని గాలిని ఆసరా చేసుకుని వైరస్లు విజృంభిస్తుంటాయి. రెండూ ఒకేసారి ప్రవేశించడంతో పులుపు తినడం వల్లే జలుబు చేసిందని అభిప్రాయం ఏర్పడింది. నిజానికి ఈ పుల్లని పండ్లు తింటే శీతాకాలంలో విజృంభించే వైరల్ ఫీవర్లు, ఫ్లూ జ్వరాలను ఎదుర్కొనే వ్యాధి నిరోధకత వస్తుంది. నిమ్మ, నారింజ, బత్తాయి పండ్లతోపాటు ఉసిరి, జామ పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధినిరోధకతను పెంపొందిస్తాయి. అందువల్ల శీతాకాలంలో జలుబు రాకుండా, వైరల్ ఫీవర్లు వచ్చినా తేలిగ్గా కోలుకునేందుకు పుల్లని పండ్లు మేలు చేస్తాయి. కాబట్టి తక్కువ ధరలో ఎక్కువ మేలు చేసే సీజన్ ఫ్రూట్స్‌ని ఎప్పుడూ…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/health/sour-fruits-boost-immunity-during-winter-2540405
framing not published · 1 outlet covered this story, below the floor for a split