Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Akhilesh Yadav : సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు (Samajwadi Party chief) అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) బీజేపీ (BJP) పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రపూరితంగా ఓటర్ల జాబితాను తారుమారు చేస్తోందని, దొంగ ఓట్లను చేర్పించడంతోపాటు ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను తొలగిస్తోందని ఆయన విమర్శించారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
పోలింగ్ బూత్ల వద్ద పార్టీ కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అవకతవకలు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని అఖిలేష్ సూచించారు. మోసం, నిజాయతీ లేకపోవడాన్నే బీజేపీ తన బలంగా భావిస్తున్నదని, అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని అఖిలేశ్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/akhilesh-yadav-the-bjp-is-conspiratorially-removing-opposition-voters-akhilesh-yadav-2540377
framing not published · 1 outlet covered this story, below the floor for a split