అలా వెళ్లి.. ఇలా వచ్చారు!
Namasthe Telangana · NT News telugu · 3 min read at Namasthe Telangana
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో మళ్లీ డిప్యుటేషన్ల తంతు కొనసాగుతున్నది. ఇటీవల ఆ సొసైటీలో డిప్యూటేషన్లు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించినప్పటికీ అమాత్యుడి అండదండలతో ఇప్పుడు మళ్లీ అక్రమంగా డిప్యుటేషన్లు ఇస్తున్నట్టు స్పష్టమవుతున్నది. దీంతో నచ్చినవారికి నచ్చిన చోట పోస్టింగ్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అమాత్యుడి పేరిట ఓ ఉన్నతాధికారి ఈ అక్రమ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నట్టు సొసైటీ మొత్తం కోడై కూస్తున్నది.
ఆ అధికారి నియామకం, ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఇష్టారీతిన తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇవి సంబంధిత మంత్రి దృష్టికి వెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడం సొసైటీ వర్గాల ఆరోపణలకు బలం చేకూర్చుతున్నది. ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రధాన కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా డిప్యుటేషన్లను గతంలోనే రద్దు చేశారు. ఈ విషయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఏప్రిల్‌లో స్వయంగా వెల్లడించడంతోపాటు 6 నెలల్లో సొసైటీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, ఒక్క అధికారి కూడా డిప్యుటేషన్‌పై లేకుండా చూస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు మళ్లీ యథేచ్ఛగా ఎక్కడికక్కడ డిప్యుటేషన్లు…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/alleged-illegal-deputations-and-promotion-delays-rock-telangana-sc-gurukul-society-2539899
framing not published · 1 outlet covered this story, below the floor for a split