Allu Arjun : బన్నీ 'ICONZA' కథేంటి? తాతయ్య జయంతి వేళ బిజినెస్ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ!
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది స్టైలిష్ యాక్టింగ్, మాస్ క్రేజ్, 'పుష్ప' మ్యానరిజమ్స్. కానీ ఇప్పుడు బన్నీ మరో కొత్త దిశగా అడుగులు వేస్తున్నాడు. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అల్లు అర్జున్.. ఇక సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లోనూ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
అక్టోబర్ 1న తన తాత, లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఆఫీస్లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. "ICONZA. కొత్త ఆఫీస్. కొత్త ప్రారంభం. మా తాతయ్య అల్లు రామలింగయ్య గారి జయంతి వేళ ఒక నయా చాప్టర్ మొదలైంది" అని పోస్ట్ చేశారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/allu-arjun-launches-iconza-what-is-pushpa-star-big-new-venture-all-about
framing not published · 1 outlet covered this story, below the floor for a split