Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Amazon Jobs | న్యూయార్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మళ్లీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రతిపాదిత డెలివరీ ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వస్తే, సుమారు 5 వేల మంది డెలివరీ ఉద్యోగులను తొలగించడంతోపాటు 15 గోదాములను మూసివేయవచ్చని సమాచారం. గోదాముల మూసివేత వల్ల మరో 2 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందని న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది. అయితే, ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం వెలువడలేదు.
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మద్దతిస్తున్న ఈ బిల్లు ప్రకారం, ప్రస్తుతం 40 థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా పనిచేస్తున్న 5 వేల మందికిపైగా డెలివరీ సిబ్బందిని అమెజాన్ నేరుగా ఉద్యోగులుగా నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే తన డెలివరీ వ్యవస్థను మార్చుకోవాల్సి వస్తుందని, అందులో భాగంగా ఉద్యోగాల కోత, గోదాముల మూసివేత వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కథనం పేర్కొన్నది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/international/amazon-may-cut-5000-delivery-jobs-over-proposed-new-york-law-2540477
framing not published · 1 outlet covered this story, below the floor for a split