Annayya Paanamlo Song: మాస్ హీరోలో ఈ ఎమోషనల్ యాంగిల్ చూశారా? 'భోగి' నుంచి అదిరిపోయే పాట రిలీజ్!
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
మాస్ హీరోగా మరోసారి తన పవర్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు శర్వానంద్. ఈసారి యాక్షన్, ఎమోషన్, పక్కా రస్టిక్ టచ్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు 'భోగి' సినిమాతో వస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా 'అన్నయ్య పానంలో' సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీపై ఆసక్తి నెలకొనగా.. ఈ పాటతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించిన ఈ పాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
శ్రీకృష్ణ గాత్రంలో వినిపించిన ఈ ఎమోషనల్ నంబర్ మనసును తాకేలా సాగింది. బీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం పాటకు ప్రాణం పోయగా.. చంద్రబోస్ రాసిన సాహిత్యం కుటుంబ బంధాల్లోని ప్రేమను, ఆప్యాయతను అందంగా పలికించింది. కేవలం ఓ పాటలా కాకుండా.. సినిమాలోని భావోద్వేగ ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/bhogi-song-release-sharwanand-touches-hearts-with-emotional-annayya-paanamlo
framing not published · 1 outlet covered this story, below the floor for a split