AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
AP News : ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ముగిసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు విధించిన గడువు ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. చివరిరోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడాయి.
ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల సమయానికి కార్యాలయ ప్రాంగణాల్లోకి చేరిన వారందరికీ అధికారులు టోకెన్లు జారీచేసి, వారి నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. దాంతో పురపోరు రసవత్తరంగా మారనుంది. ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీకి ఊహించని పరిణామం ఎదురైంది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/andhrapradesh-news/ap-news-ap-municipal-elections-deadline-for-nominations-ends-2539486
framing not published · 7 outlets covered this story, below the floor for a split