అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
కూసుమంచి, వెలుగు: సార్వత్రిక ఎన్నికల నాటికి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు మంత్రి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి పేదలకు ఇళ్లు ఇవ్వకుండా కమీషన్ల కోసం కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు.
హైదరాబాద్లోని 23 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని, రెండు లక్షల ఇళ్లకు సంబంధించిన ఫైనల్ బిల్లులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని, ఆ అప్పులను చెల్లిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/ponguleti-srinivas-reddy-comments-indiramma-housing-scheme
framing not published · 1 outlet covered this story, below the floor for a split