బకాయిల బందిఖానాలో ఖజానా
Namasthe Telangana · NT News telugu · 4 min read at Namasthe Telangana
వేల కోట్ల పెండింగ్ బిల్లులతో ఉద్యోగుల కన్నీళ్లు..న్యాయం కోసం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు! గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఎదురుచూపులు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వం..ప్రజలకు సేవలందించే ఉద్యోగుల సమస్యలను కూడా సకాలంలో పరిష్కరించలేకపోతే పరిపాలనా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న పెండింగ్ బిల్లుల సమస్య ఇలాంటి పరిస్థితినే ప్రతిబింబిస్తున్నది.ఏండ్ల్ల తరబడి ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులు తమకు చట్టబద్ధంగా అందాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం…
ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, అడ్వాన్స్ బిల్లులు, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలకు సంబంధించిన బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరినట్లు ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, గృహ రుణాలు, ఇతర ఆర్థిక బాధ్యతలను నిర్వహించాల్సిన సమయంలో తమకు రావాల్సిన సొమ్ము అందకపోవడం వారిని తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/editpage/thousands-of-crores-in-pending-bills-leave-telangana-employees-and-retirees-waiting-for-relief-2538260
framing not published · 1 outlet covered this story, below the floor for a split