బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే ఛాన్స్ : ఎన్ నినో దరిద్రం పోనుందా..!
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
ఎల్ నినో కరువుతో తెలుగు రాష్ట్రాల్లో నీటి కష్టాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్ ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటవచ్చని.. ఇదే జరిగితే భారీ వర్షాలతో నీటి కష్టాలు తీరతాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.
ప్రస్తుతం అంటే.. 2026, అక్టోబర్ 21వ తేదీ నాటికి ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో.. నైరుతి బంగాళాఖాతంలో.. సముద్ర మట్టానికి ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్టోబర్ 24 లేదా 25 తేదీల్లో అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/potential-cyclone-brewing-in-bay-of-bengal-may-hit-andhra--odisha-coast
framing not published · 1 outlet covered this story, below the floor for a split