Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Bathukamma : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఇంటింటా రంగులరంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. మహిళలు నూతన పట్టు వస్త్రాలు ధరించి బతుకమ్మలను ఎత్తుకుని వేదికల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బతుకమ్మ పాటలు, ఆటలతో సందడి చేశారు. బతుకమ్మ పండుగతో పల్లెలు, పట్టణాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. పట్టణాల్లో వాడవాడలు, రాష్ట్రంలోని పల్లెలన్నీ బతుకమ్మ డీజే పాటలతో మార్మోగాయి.
రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెనా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అన్ని జిల్లాల్లో బతుకమ్మ సందడితో కళకళలాడాయి. నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో అంగరంగవైభవంగా బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. శాళీగౌరారం మండలం అంబారీపేట గ్రామంలో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/bathukamma-grand-celebrations-of-bathukamma-across-the-state-videos-2539571
framing not published · 17 outlets covered this story, below the floor for a split