బౌలర్లను బలి చేయకండి: IND vs WI మ్యాచ్‌కి ముందు బీసీసీఐకి మాజీ సెలక్టర్ కీలక సూచన
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బౌలర్లకి చుక్కలు కనిపిస్తున్నాయి. మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఏకంగా మూడింట్లో ఇరు జట్లు 200+ స్కోర్లు సమర్పించుకున్నాయి. రెండో టీ20లో భారత్ 249/5 రన్స్ చేసినప్పటికీ, విండీస్ బ్యాటర్లు ఊచకోత కోసి 9 బంతులు మిగిలి ఉండగానే ఆ టార్గెట్‌ను ఛేదించారు. ఇక నాలుగో టీ20లోనూ కరేబియన్ టీమ్ 247 పరుగులు బాదింది. ఈ బ్యాటింగ్ ఉతుకుడుపై భారత మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బౌలర్లను కాపాడుకోవడానికి బీసీసీఐ ముందుకు వచ్చి బ్యాట్, బాల్ మధ్య సమాన పోటీ ఉండే పిచ్‌లను తయారు చేయాలని కోరారు.
ANIతో చేతన్ శర్మ మాట్లాడుతూ.. మైదానాల్లో కేవలం సిక్సర్లు, ఫోర్లు మాత్రమే కాకుండా బౌలర్లకు కూడా కాస్త గౌరవం దక్కాలని అభిప్రాయపడ్డారు. పిచ్‌ల విషయంలో కొద్దిగా మార్పులు అవసరం. ప్రేక్షకులు ఫోర్లు, సిక్సర్లు చూడాలనుకుంటారని నాకు తెలుసు, కానీ దయచేసి బౌలర్లపై కూడా కొంచెం దృష్టి పెట్టండి అని కోరారు. బౌలర్లని బలి చేయడానికి నేను ఒప్పుకోను, కానీ వాళ్లు మైదానంలోకి రావడానికి భయపడేంతలా బాదకండి.. ఆరోగ్యకరమైన పోటీ చాలా ముఖ్యం.. దేశవాళీ క్రికెట్లో లాగే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ బౌలింగ్‌కు సహకరించే సమతుల్య వికెట్లు ఇవ్వాలి.. ఒక జట్టు 400 కొడితే, ఇంకో జట్టు దాన్ని మరో 6 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించడం మరీ…
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/dont-sacrifice-bowlers-former-selectors-advice-to-bcci-ahead-of-india-vs-west-indies-match
framing not published · 1 outlet covered this story, below the floor for a split