Vekuva · Politics · Education01 Oct 2026 · p.1/1
బీసీ హాస్టళ్లు, గురుకులాల డైట్ ఛార్జీలు పెంపు
Eenadu · Eenadu · 1 min read at Eenadu
అమరావతి: బీసీ హాస్టళ్లు, గురుకులాల డైట్ ఛార్జీలు పెంచుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమలు కానున్నాయి. 3-6వ తరగతి విద్యార్థుల డైట్ ఛార్జీలు రూ.1150 నుంచి 1265కు పెంచారు. 7-10వ తరగతి విద్యార్థులకు రూ.1400 నుంచి రూ.1600కు పెంచారు. ఇంటర్, ఆపై తరగతి విద్యార్థులకు రూ.1600 నుంచి రూ.1800కు పెంచారు. పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా నూతన మెనూ అమలు చేయనున్నారు. వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడు రోజులు చికెన్.. రోజూ పాలు, పండ్లు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Full story at Eenadu: https://www.eenadu.net/breaking-news/426011241
framing not published · 1 outlet covered this story, below the floor for a split