భళా బాహుబలి
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
కొల్లాపూర్, అక్టోబర్ 16 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్-1 వద్ద రెండు మోటర్ల నుంచి నీటి పంపింగ్ కొనసాగుతున్నది. నాగర్ర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. ఒక్కో మోటర్ 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు బాహుబలి మోటర్లు ఆన్ చేస్తేనే.. డెలివరీ సిస్టర్న్ నుం చి జలాలు ఉప్పొంగి.. నదీ ప్రవాహాన్ని తలపి స్తూ నార్లాపూర్ రిజర్వాయర్లోకి చేరుతున్నా యి. కృష్ణానీటిని దాదాపు 100 మీటర్ల ఎత్తుకు పంపులు నీటిని ఎత్తిపోస్తున్నాయి.
ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా బాహుబలి మోటర్లకు అంకురార్పణ చేసి.. నది అడుగు భాగంలో కోతిగుండు ప్రాంతం నుంచి నీటిని ఎత్తిపోసేలా నిర్మాణం పూర్తయిన పీఆర్ఎల్ఐని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై వివక్ష చూ పుతూ నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభు త్వం మరుగున పెట్టేందుకు యత్నించినా నేడు కరు వు నుంచి తప్పించేకునేందు కు ఇదే లిఫ్ట్ పంపింగ్ శరణ్యమైం ది. ఇదంతా కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/palamuru-rangareddy-project-pumps-krishna-water-into-narlapur-reservoir-using-two-bahubali-motors-2538450
framing not published · 70 outlets covered this story, below the floor for a split