BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
BRS AUSTRALIA : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘కేసీఆర్ ఫామ్హౌస్కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఇన్చార్జి అనిల్ బిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతులకు ఎంతో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచురించకుండా పత్రికలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అదేవిధంగా తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక ముందు వారు కొన్ని డిమాండ్లు ఉంచారు. ఆ డిమాండ్లు ఏమిటంటే.. 1. తెలంగాణ రైతుల జీవనాడి అయిన సాగునీటి ప్రాజెక్టులపై ఇలాంటి తప్పుడు ప్రాపగాండాను సహించేది లేదు. 2. ‘కేసీఆర్ ఫామ్హౌస్కు మళ్లిన కొండపోచమ్మ’ అనే పచ్చి అబద్ధపు కథనాన్ని 24 గంటల్లో ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. 3. ఆ క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించడంతోపాటు, డిజిటల్ వేదికలు, అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనూ వెల్లడించాలి.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/nri/brs-australia-we-strongly-condemn-the-false-propaganda-by-velugu-newspaper-anil-baireddy-2539548
framing not published · 7 outlets covered this story, below the floor for a split