Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Build Now Rules | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆశపడే మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా చిన్న ప్లాట్ల యజమానులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం 20 ఫీట్ల కంటే వెడల్పు తక్కువ ఉన్న చిన్న ప్లాట్లలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ‘బిల్డ్ నౌ’ పోర్టల్ చుకలు చూ పిస్తున్నది. తెలంగాణ బిల్డింగ్ నిబంధనలు, సె ట్బ్యాక్ రూల్స్ పేరుతో ఆన్లైన్ దరఖాస్తులు వరుసగా తిరసరణకు గురవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి చిన్న ప్లాట్లకు సంబంధించిన పర్మిష న్లు ఎందుకు తిరస్కరణకు గురవుతున్నాయి? సాఫ్ట్‌వేర్‌లో ఎందుకు మార్పులు చేయడం లేదనేది చర్చనీయాంశంగా మారింది. ప్లాట్ వెడల్పు 18 ఫీట్లు మాత్రమే ఉంటే ఇల్లు కట్టుకోవడం కత్తి మీద సామే. భవన నిబంధనల ప్రకారం 100 చదరపు గజాల లోపు ప్లాట్‌కు కూడా చుట్టూ ఖాళీ స్థలాలు(సెట్‌బ్యాక్స్) వదలాలి. రోడ్డు వైపు కనీసం 4.9ఫీట్లు(1.5 మీటర్లు) ఖాళీగా వదలాల్సి ఉంటుంది. ఇరువైపులా సైడ్ సెట్‌బ్యాక్ పోను, మిగిలే స్లాబ్ వెడల్పు చాలా త కువగా ఉంటుంది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/hyderabad-small-plot-owners-face-construction-hurdles-under-build-now-rules-2538395
framing not published · 1 outlet covered this story, below the floor for a split