బ్యాటింగ్‌లో చేతులేత్తేసిన జింబాబ్వే.. స్మృతి సేన టార్గెట్ ఎంతంటే..?
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
గాంధీనగర్: భారత జట్టుతో జరుగుతోన్న తొలి టీ20లో బ్యాటింగ్‌లో జింబాబ్వే మహిళా జట్టు తడబడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
ఓపెనర్ కెల్లీస్ ఎన్డ్లోవు (42), షార్న్ మేయర్స్ (43) ఇద్దరే రాణించారు. భారత బౌలర్లు విజృంభించడంతో మిగిలిన బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే భారీ స్కోర్ చేయలేకపోయింది. భారత బౌలర్లలో నందిని శర్మ రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, శ్రీచరణి, అరుంధతి రెడ్డి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం స్మృతి సేన 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/zimbabwe-scored-114-runs-in-the-first-t20
framing not published · 1 outlet covered this story, below the floor for a split