చెలరేగిన షెఫాలీ, స్మృతి.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై భారత్ గ్రాండ్ విక్టరీ
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
రాయ్పూర్: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత ఉమెన్స్ టీమ్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో షెఫాలీ వర్మ (55), కెప్టెన్ స్మృతి మందనా (47) చెలరేగడంతో జింబాబ్వే నిర్దేశించిన 103 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.5 ఓవర్లలోనే చేధించి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది.
రాయ్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/indian-womens-team-secures-a-resounding-victory-over-zimbabwe-in-the-second-t20
framing not published · 2 outlets covered this story, below the floor for a split