చెన్నైని ముంచెత్తిన భారీవర్షాలు..మిచాంగ్ తుఫాన్ తర్వాత అత్యధిక వర్షపాతం
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉత్తర చెన్నైలోని ప్యారీస్ కార్నర్, ఎన్నూర్, అలాగే దక్షిణ చెన్నైలోని మీనంబాక్కం, తిరువొత్తియూర్ వంటి ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి భారీ వర్షం ముంచెత్తింది. చెన్నై కార్పొరేషన్ పరిధిలో గత 24 గంటల్లో సగటున 105 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో చెన్నై వీధులు జలమయమయ్యాయి. పలు చోట్ల వాహనాలు నీట మునిగాయి. రవాణా, జనజీవనం స్థంభించిపోయింది.2023లో మిచాంగ్ తుఫాను తర్వాత చెన్నైలో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ఉత్తర చెన్నైలో తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం కురిసింది. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
సాధారణంగా, ఈశాన్య రుతుపవనాల సమయంలో 69 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుందని అంచనా. కానీ సాయంత్రం 6 గంటల నుంచి ప్యారీస్లో 35.8 సెంటీమీటర్లు, తిరువొత్తియూర్లో 31.2 సెంటీమీటర్లు, మనాలిలో 25 సెంటీమీటర్లు, ఎన్నూర్లో 20.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అని తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జున తెలిపారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/chennai-flooded-after-recordbreaking-358-cm-rainfall-traffic-normal-life-disrupted
framing not published · 1 outlet covered this story, below the floor for a split