China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
బీజింగ్: భారత్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రభావం చూపే కీలక యంత్రాల ఎగుమతులపై చైనా సోమవారం కొత్త ఆంక్షలు ప్రకటించింది. వీటిలో సొరంగాల తవ్వకానికి ఉపయోగించే టన్నెల్ బోరింగ్ యంత్రాలు కూడా ఉన్నాయి. జాతీయ భద్రత, ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ నియంత్రణలు విధిస్తున్నట్టు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఆంక్షలు నవంబర్ 18 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ నిర్ణయం భారత్లో నిర్మాణంలో ఉన్న భూగర్భ మెట్రో రైలు మార్గాలు, హైస్పీడ్ రైల్వే లైన్లు, వివిధ ప్రాంతాల్లోని సొరంగాల నిర్మాణ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపడుతున్న సొరంగాల నిర్మాణానికి అవసరమైన యంత్రాల లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టీబీఎంల ఎగుమతులపై చైనా గత కొన్నేండ్లుగా భారత్కు ఆంక్షలు విధిస్తున్నది. కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో పనిచేసే వాకింగ్ ఎక్స్కవేటర్లు, ఎత్తైన పీఠభూమి ప్రాంతాల్లో ఉపయోగించే వెట్ షాట్క్రీట్ యంత్రాల ఎగుమతిపైనా చైనా ఆంక్షలు విధించింది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/international/chinas-export-restrictions-may-impact-indias-infrastructure-projects-2540467
framing not published · 1 outlet covered this story, below the floor for a split