Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Namasthe Telangana · NT News telugu · 4 min read at Namasthe Telangana
Civil Supplies | హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): సివిల్ సైప్లెలో మహబూబాబాద్ జిల్లా మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు ఇండ్లపై ఏసీబీ నిర్వహించిన దాడుల్లో కండ్లు బైర్లు కమ్మే అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.9.41 కోట్లుగా చెప్తున్నప్పటికీ, మార్కెట్ విలువ మాత్రం రూ.100 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. సివిల్ సైప్లెలో ఒక జిల్లా అధికారి ఇంత భారీస్థాయిలో ఆక్రమ ఆస్తులతో పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. నరసింహారావు శాంపిల్ మాత్రమేనని, సివిల్ సైప్లెలో అంతకుమించిన అవినీతిపరులు ఉన్నారనే చ ర్చ నడుస్తున్నది. అన్ని జిల్లాల డీఎంలు, డీఎస్వోలు, హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కీలక విభాగాలకు…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పనిచేసి, ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలో ఉన్న ఓ డీఎం రెండేండ్లలోనే సుమారు రూ.5 కోట్లు అక్రమార్జన చేసినట్టు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేసి ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండలో ఉన్న మరో డీఎం కనీసంగా రూ.10 కోట్లు అక్రమ సంపాదన వెనుకేసినట్టు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్లిన మరో డీఎం సైతం కోట్లాది రూపాయలు అక్రమార్జన ద్వారా కూడబెట్టినట్టు ఆరోపణలున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల కన్నా సివిల్ సైప్లెలో జిల్లా మేనేజర్ (డీఎం) లేదా జిల్లా సివిల్ సైప్లె ఆఫీసర్ (డీసీఎస్వో) పోస్టింగే పవర్ఫుల్ అనే చర్చ నడుస్తున్నది. మిల్లర్లతో…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/civil-supplies-corruption-allegations-acb-raid-on-mahabubabad-dm-sparks-debate-2540852
framing not published · 1 outlet covered this story, below the floor for a split