CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
CM Revanth Reddy : ఎల్‌నినో ముప్పు నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ‘ఇప్పుడు నేనేం చేయలేను, పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంద’ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేతులెత్తేశారు. ఎల్‌నినోపై సమీక్ష సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం ప్రజలందరూ నీళ్లు, విద్యుత్‌ను పొదుపుగా ఉపయోగించాలని సూచించారు. అయితే.. పక్క రాష్ట్రం నుంచి రూ.15కు విద్యుత్ కొనుగోలు చేసి ఇస్తామని చెబుతూనే, మనకు విద్యుత్ కోతలు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
చేతులు కాలాక ఆకులు ముట్టుకున్నట్టు అన్న చందంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి తీరు. శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలు ఎల్‌నినోపై అప్రమత్తం చేసినా.. రైతులకు సాగునీటిపై నిర్లక్ష్యం తగదని వారించినా లెక్కచేయని ముఖ్యమంత్రి ఇప్పుడు పొదుపు మంత్రను సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు నీళ్లు, విద్యుత్ వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు. అయితే.. ఎల్‌నినో ముప్పును ముందే గ్రహించిన మిగతా రాష్ట్రాలు 9 నుంచి 10 నెలల ముందే నీరు, విద్యుత్ లాంటి సాధారణ అవసరాలను సమకూర్చుకుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/cm-advices-people-to-save-water-and-electricity-2537412
framing not published · 1 outlet covered this story, below the floor for a split