Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Congress Leaders | దండేపల్లి, అక్టోబర్19 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ఆ దివారం అర్ధరాత్రి సద్దుల బతుకమ్మ వే డుకల సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్రావు, ఎమ్మెల్యే వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళి తే.. ఆదివారం రాత్రి తాళ్లపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్ర హం వద్ద ఉన్న ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఫ్లెక్సీ విషయంలో ఇరు వర్గాల నేతలు ఘర్షణకు దిగారు. దీంతో బతుకమ్మ ఆడుతున్న మహిళలు భయాందోళనలకు గురయ్యా రు. పోలీసులు లాఠీచార్జికి యత్నించడం తో ఉద్రిక్తత నెలకొన్నది.
గిరిజన మహిళా సర్పంచ్ కుర్సెంగ కళావతిపై సీఐ అకార ణంగా దాడి చేశారంటూ జగన్మోహన్ రావుతో పాటు ఆయన వర్గానికి చెందిన మాజీ జీసీసీ చైర్మన్ తిరుపతి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాజేందర్, సీనియర్ నాయకులు చీటి సత్యంరావు, ముత్తె రాజన్న, సుభాష్‌తోపాటు పలువురు రోడ్డుపై బైఠాయించారు. సర్పంచ్ కళావతి, ఉపసర్పంచ్ తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ రాజేందర్‌పై దాడి చేసిన సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాసేపటికి దండేపల్లి నుంచి తాళ్లపేటకు చే రుకున్న ఎమ్మెల్యే వర్గీయులు, జగన్మోహన్ వర్గీయుల మధ్య మరోసారి ఘర్షణ జరిగిం ది. వెంటనే పోలీసులు ఎమ్మెల్యే వర్గీయుల ను అక్కడి నుంచి పంపించివేశారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/adilabad/mancherial/clashes-between-congress-factions-disrupt-saddula-bathukamma-celebrations-in-mancherial-2540636
framing not published · 1 outlet covered this story, below the floor for a split