Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Crude Oil Price : ముడిచమురు ధరలు (Crude Oil Price) ఇవాళ (మంగళవారం) ఐదు నెలల గరిష్ఠానికి చేరాయి. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధర బ్యారెల్కు 53 సెంట్లు (0.48 శాతం) పెరిగి 110.08 డాలర్లకు చేరింది. అంతకుముందు సెషన్లో ఇది 110.70 డాలర్లను తాకింది. మే 20 తర్వాత ఇదే అత్యధిక స్థాయి. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ధర కూడా 45 సెంట్లు (0.46 శాతం) పెరిగి బ్యారెల్కు 99 డాలర్లకు చేరుకుంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై దాడులు, సముద్ర రవాణా భద్రతపై ఆందోళనలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు, హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. యెమెన్లో సైనిక శిక్షణ కేంద్రంపై హౌతీ దాడులు, సౌదీ అరేబియాలోని ఇంధన కేంద్రాలు, విమానాశ్రయాలు, సైనిక స్థావరాలపై దాడులు చమురు ధరలకు మరింత ఊతమిచ్చాయి.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/business/brent-crude-hits-five-month-high-as-attacks-on-ships-saudi-sites-fuel-supply-worries-2540802
framing not published · 1 outlet covered this story, below the floor for a split