Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Cyberabad Police | సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలం గాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరి ధిలో పోలీసు గస్తీ గతి తప్పుతోంది. మెజార్టీ ఎస్చ్లు ఏరియాలలో రౌండ్స్ తిరగడం మర్చిపోయి, ఠాణాలకే పరిమితమవుతు న్నారు. ముఖ్యంగా భూ దందాలు, ఇతర సెటిల్మెంట్లతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొందరు ఎస్ఐలు, సీఐలు, ఏసీ పీలు, డీసీపీలు బిజీ అవుతున్నారనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. సైబరాబాద్ లో పోస్టింగ్ అంటేనే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవచ్చనే ఆలోచనతో చాలామంది అధికా రులు అక్కడ పోస్టింగ్ కోసం డిపార్ట్మెంట్ లోని పెద్దల వద్ద పైరవీలు చేస్తుంటారని సమాచారం. అనుకున్న పోస్టింగ్ పొందిన తర్వాత ఇక పెట్టిన పెట్టుబడిని…
పెట్టుబడుల పోస్టుంగ్లతో కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు పట్టుసడలుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా మంది అధికారులు విధుల్లో సింహభాగం సమయాన్ని తమ పెట్టుబడిని రాబడిగా మార్చుకోవడంలోను, తమను ఆశీర్వదించిన పెద్దలకు సేవలు అందించడంతోనే సరిపోవ డంతో.. ప్రజా సమస్యలపై దృష్టిపెట్టలేకపోతున్నారనే టాక్. దీంతో కమిషనరేట్ పరిధిలో గతంలో కంటే ఇప్పుడు దోపిడీ దొంగలు, సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారు. కమిషనరేట్ పరిధిలో హత్యలు, అత్యాచా రాలు వంటి నేరాలు పెరగిపోతుండటమే ఇందుకు ఉదాహరణ.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/hyderabad/cyberabad-police-negligence-on-duty-raises-questions-over-night-patrolling-2540843
framing not published · 1 outlet covered this story, below the floor for a split