డబ్బులు కట్ అయ్యి వెనక్కి రాలేదా? బ్యాంకుల నుంచి రోజుకు రూ.100 పరిహారం వసూలు చేసుకోండి!
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
రోజువారీ అవసరాల్లో భాగంగా మనం UPI పేమెంట్లు చేయడం, ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తూనే ఉంటాం. అయితే ఒక్కోసారి సర్వర్ డౌన్ కావడం, నెట్వర్క్ ఇష్యూ లాంటి సాంకేతిక సమస్యలతో లావాదేవీలు ఫెయిల్ అవుతుంటాయి. ఆ సమయంలో మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి కానీ అవతలి వారికి చేరవు. కొన్నిసార్లు ఏటీఎం నుంచి క్యాష్ బయటకు రాకుండానే అకౌంట్లో కట్ అవుతుంటాయి. ఈ సమయంలో మనకు వచ్చే టెన్షన్ అంతా ఇంతా కాదు. డబ్బులు వెనక్కి రాకపోగా.. బ్యాంకులు లేదా పేమెంట్ యాప్ల నిర్లక్ష్యానికి RBI గట్టి షాక్ ఇచ్చే అద్భుతమైన నిబంధన తెచ్చిందన్న విషయం మనలో చాలా మందికి తెలియదు.
అవును మనం చేసిన ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు నిర్దిష్ట గడువులోగా బ్యాంకులు డబ్బును తిరిగి మన అకౌంట్లో జమ చేయకపోతే.. ప్రతి రోజూ ఆలస్యానికి రూ.100 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నష్టపరిహారం కేవలం ఫెయిల్ అయినందుకు మాత్రమే కాదు.. బ్యాంకులు ఆలస్యం చేసే ప్రతి రోజుకు చెల్లించే జరిమానా అన్నమాట. దీనికోసం ప్రత్యేకంగా మీరు ఎక్కడా ఫిర్యాదు చేయాల్సిన పని లేకుండానే ఆటోమేటిక్గా ఖాతాలో జమ చేయాలని ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/failed-transactions-get-rs-100-per-day-compensation-under-rbi-rules
framing not published · 1 outlet covered this story, below the floor for a split