దసరా రోజు.. జమ్మిచెట్టుకు పూజ.. పాలపిట్ట దర్శనం.. విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
దసరా పండుగ గురించి పురాణాల్లో విశేషంగా చెప్పారు. హిందువులు ఈ పండుగను ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. రామాయణం.. మహాభారత గ్రంధాల్లో కూడా ఈ పండుగ ప్రాధాన్యత.. విశిష్టత గురించి చెప్పారు. దసరా పండుగ రోజున పాండవులు పాల పిట్టను చూడటం.. రాముడు యుద్దంలో విజయం సాధించిన రోజుని భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. . దసరా రోజు భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు.
మహాభారతంలో పాండవులు రాజ్యాన్ని విడిచి అరణ్యవాసంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన రోజు.. వాళ్లకు సంబంధించిన ఆయుధాలన్నింటినీ ఒక మూట కట్టి, తిరిగొచ్చే వరకూ వాటిని చూసుకోమని జమ్మి చెట్టుకి కడతారు. అరణ్యవాసం పూర్తయ్యాక వాళ్లు ఆశ్వయుజ మాసంలోని దశమి రోజునే తిరిగొచ్చి తమ ఆయుధాలను తీసుకుంటారు. ఆ తర్వాత కౌరవులపై యుద్ధం చేసి తిరిగి తమ రాజ్యాన్ని పాండవులు దక్కించుకున్న విషయం తెలిసిందే.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/significance-of-dasara-jammi-chettu-and-palapitta
framing not published · 1 outlet covered this story, below the floor for a split