దసరా రోజు రావణ శోభా యాత్ర.. జమ్మి ఆకులు తెంపడం మహా పాపమంటున్న గిరిజనులు !
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
గడ్చిరోలి: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో రావణ శోభా యాత్ర ఘనంగా జరిగింది. అహేరి తాలుకా కోడిసేలగూడలో దసరా పండుగ సందర్భంగా రావణ శోభా యాత్రను నిర్వహించారు. కోడిసేల గూడ నుంచి కమలపూర్ వరకు శోభా యాత్ర సాగింది. యాత్రలో పాల్గొనడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శోభా యాత్రలో పాల్గొనడానికి జపాన్, శ్రీలంక దేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.
నవరాత్రులు నియమనిష్ఠలతో రావణ బ్రహ్మను అదివాసీలు పూజించారు. రావణుడు తమ దైవమని ఆదివాసీలు చెబుతున్నారు. జమ్మి ఆకులు తెంపడం మహా పాపమని, జమ్మి ఆకులు తెంపితే అడవి నాశనం అవుతుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. రావణ దహనం చేయవద్దని, దైవంగా పూజించాలని ప్రజలను గిరిజనులు కోరుతున్నారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/ravana-shobha-yatra-took-place-in-the-gadchiroli-district-of-maharashtra
framing not published · 1 outlet covered this story, below the floor for a split