దసరాకు ఊరెళ్తున్నారా..ఇండ్లు పైలం.. ఈ విషయాలు మర్చిపోవద్దు
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న హైదరాబాద్ ప్రజలు ఇంటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే సమయంలో దొంగతనాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంటి తలుపులు, కిటికీలకు పటిష్ఠమైన తాళాలు వేయడంతో పాటు విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరచుకోవాలని సూచిస్తున్నారు.
ఊరికి వెళ్లే ముందు ఇంటి ప్రధాన ద్వారాలు, వెనుక తలుపులు, కిటికీలను సరిగ్గా మూసి పటిష్ఠమైన తాళాలు వేయాలి. ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు, విలువైన పత్రాలు, ఇతర ఖరీదైన వస్తువులను బహిరంగంగా ఉంచకూడదు. వీలైతే బంగారు ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లో లేదా ఇతర సురక్షిత ప్రదేశంలో భద్రపరచుకోవాలి. ఇంట్లో సీసీటీవీ కెమెరాలు, భద్రతా అలారం వ్యవస్థలు ఉంటే అవి సక్రమంగా పనిచేస్తున్నాయో ముందుగానే తనిఖీ చేసుకోవాలి. ఇంటికి తాళం వేసి వెళ్లే విషయాన్ని నమ్మకమైన పొరుగువారికి తెలియజేసి, ఇంటి పరిసరాలపై నిఘా ఉంచాలని కోరాలి. అపార్ట్మెంట్లలో నివసించేవారు సెక్యూరిటీ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడం మంచిది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/hyderabad-police-safety-advisory-for-dasara-holidays
framing not published · 2 outlets covered this story, below the floor for a split