Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Delhi Police : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టనుంది. నవంబర్ 1న ర్యాలీ నిర్వహించనుంది. ఇందుకోసం ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుమతిపత్రం మంజూరు చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్కు, సర్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కూటమి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో కూడా ఆందోళనల సరళిపై నిర్ణయం తీసుకున్నారు.
దీనిలో భాగంగా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికను ఆందోళనల చేసే ప్రదేశాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో రాంలీలా మైదానంలో ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులను కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది. వారి వినతిని పరిశీలించిన పోలీసులు.. నవంబర్ 1న ర్యాలీ నిర్వహించుకునేందుకు అనుమతించారు. శనివారం నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/delhi-police-allows-congress-to-hold-rally-at-ramlila-maidan-on-november-1-heres-what-delhi-police-said-2538891
framing not published · 204 outlets covered this story, below the floor for a split