దేవాకు రజనీకాంత్, విజయ్ కన్నీటి నివాళులు.. ప్రభుత్వ లాంఛనాలతో సంగీత దర్శకుడు అంత్యక్రియలు!
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో మరో విషాదం చోటుచేసుకుంది. తనదైన బాణీలతో కోట్లాది మంది సంగీత ప్రియులను అలరించిన ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు 'దేనిసై తేండ్రల్' దేవా (75) కన్నుమూశారు. అక్టోబర్ 17న చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యతో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. దేవా మరణవార్తతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.
దేవా మరణవార్త తెలిసిన వెంటనే సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం చెన్నైలోని దేవా నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. రజనీకాంత్ నటించిన 'అన్నామలై','బాషా', 'అరుణాచలం' వంటి చిత్రాలకు దేవా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా రజనీ పేరు తెరపై కనిపించే సమయంలో వినిపించే ప్రత్యేకమైన టైటిల్ మ్యూజిక్ ఆయనకు చిరస్థాయిగా గుర్తింపును తెచ్చిపెట్టింది. సూపర్‌స్టార్ తెరపై కనిపించగానే అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే ఆ సంగీతం వెనుక దేవా ప్రతిభను చిరస్థాయిగా గుర్తుచేస్తుంది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/veteran-composer-deva-no-more-vijay-rajinikanth-and-kamal-haasan-pay-tribute
framing not published · 9 outlets covered this story, below the floor for a split