ఢిల్లీలో CJP సరికొత్త నిరసన: కాక్రోచ్లకు అభిజిత్ దీప్కే కీలక పిలుపు
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ మరో భారీ నిరసనకు సిద్ధమైంది. 2026, అక్టోబర్ 16న ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో లెహ్రా దో త్రిరంగా యాత్రకు పిలుపునిచ్చింది. తమతో పాటు జాతీయ జెండాను తీసుకురావాలని నిరసనకారులకు సీజేపీ సూచించింది. ఢిల్లీకి రాలేని వారు ఆరోజు సాయంత్రం తమ తమ ఏరియాల్లో జాతీయ జెండాలతో ర్యాలీ తీయాలని కోరింది. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల అరెస్ట్, వారి జ్యుడీషియల్ కస్టడీకి వ్యతిరేకంగా జాతీయ జెండా ఎగరేయడం తప్పు కాదనే నినాదంతో ఈ నిరసన చేపట్టనున్నట్లు కాక్రోచ్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే బుధవారం (అక్టోబర్ 14) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని…
‘‘సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకే జైలు పాలయ్యారు. వీరి అరెస్ట్, రిమాండ్‌కు నిరసనగా త్రివర్ణ పతాకాన్ని ప్రేమించే దేశభక్తులందరూ అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌కు జాతీయ జెండాతో రావాలని నేను కోరుతున్నాను. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరం కాదని మనం నిరూపిద్దాం. ఢిల్లీకి రాలేని వారు ఆరోజు సాయంత్రం మీ నగరాల్లో త్రివర్ణ పతాకంతో ఊరేగింపులు నిర్వహించి ఆ పతాకమే మన గర్వమని చాటి చెప్పండి. ఈ నిరసన తర్వాత నన్ను కూడా జైలుకు పంపవచ్చు. కానీ నాకు ఎలాంటి ఆందోళన లేదు. త్రివర్ణ పతాకం నా గర్వం. నేను దానిని ఎగురవేస్తాను’’…
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/cjp-announces-fresh-protest-in-delhis-connaught-place-on-october-16
framing not published · 1 outlet covered this story, below the floor for a split