ఢిల్లీలో హై టెన్షన్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే, నేహా బోరా
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ లెహ్రా దో తిరంగా నిరసన కార్యక్రమంతో దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. శాంతి భద్రతలు, ఇతర కారణాలతో కన్నాట్‌ప్లేస్‌లో సీజేపీ లెహ్రా దో తిరంగా ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలోనే ర్యాలీలో పాల్గొనకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సీజేపీ మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అభిజిత్‌ను తరలిస్తోన్న పోలీస్ వాహవాన్ని సీజేపీ ప్రొటెస్టర్స్ అడ్డుకున్నారు. ఈ పరిణామంతో అక్కడ కాసేపు ఉద్రిక్తతల నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీజేపీ మద్దతుదారులను చెదరగొట్టి అభిజిత్ దీప్కేను అక్కడి నుంచి తరలించారు. సీజేపీ లెహ్రా దో తిరంగా ర్యాలీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కన్నాట్ ప్లేస్ లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కన్నాట్ ప్లేస్‌ను పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకుని పలు ఆంక్షలు అమలు చేశారు.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/abhijeet-dipke-neha-bora-taken-into-custody-by-delhi-police
framing not published · 1 outlet covered this story, below the floor for a split