ఢిల్లీలో విద్యార్థుల మెరుపు నిరసనలు
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : భారీ పోలీసు మోహరింపు మధ్య సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, మండీ హౌస్ వద్ద జాతీయ పతాకాలు పట్టుకుని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు, విద్యార్థి సంఘాలకు చెందిన సభ్యులు శుక్రవారం మెరుపు నిరసనలు తెలియచేశారు. కన్నాట్ ప్లేస్ లోపలి వలయం గుండా నడుస్తూ, మధ్యమధ్యలో ‘జై హింద్’ అని నినాదాలు చేస్తూ నిరసనకారులు చెల్లాచెదురై వేర్వేరు ప్రదేశాలలో తిరిగి ఏకమయ్యారు. కొందరు జాతీయ గీతాన్ని కూడా ఆలపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)ను వెనక్కి తీసుకోవాలని, 2023 ఎన్నికల కమిషనర్ల నియామక…
సెంట్రల్ ఢిల్లీలోని ఝండేవాలన్లో ఉన్న నివాసం నుంచి దీప్కేను, మండీ హౌస్ వద్ద నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అక్కడ గుమికూడిన జనం, కెమెరా బృందాలు, భారీ సంఖ్యలో ఉన్న భద్రతా సిబ్బంది మధ్య తోపులాట జరిగి గందరగోళం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించిన సమయంలో వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. సీజేపీ పిలుపు మేరకు కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించ తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్కు ప్రతిస్పందనగా ఈ నిరసనలు జరిగాయి. అయితే కన్నాట్ ప్లేస్, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా ప్రజలు…
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/delhi-sees-high-security-protests-against-sir-police-detain-activists-2538231
framing not published · 204 outlets covered this story, below the floor for a split