DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
DMK : తమిళనాడు (Tamil Nadu) లోని ప్రతిపక్ష డీఎంకే పార్టీ (DMK Party) కేంద్ర ఎన్నికల సంఘం (Centrel Election Commission) పై, ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, ఈవీఎం (EVM) ల స్థానంలో తిరిగి బ్యాలెట్ విధానాన్నే ప్రవేశపెట్టాలని ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా (Voters list) ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కూడా తీర్మానించారు.
ఇవాళ (శనివారం) ఉదయం 11 గంటలకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం నాలుగు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించాలనేది వాటిలో ఒకటి.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/dmk-mps-meet-in-chennai-demand-removal-of-sir-return-to-ballot-papers-and-support-youth-protests-2538723
framing not published · 204 outlets covered this story, below the floor for a split