Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donadl Trump) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేస్తూ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో భారత్, చైనా దేశాలకు భారీ ఊరట లభించింది. రష్యా వద్ద భారీ మొత్తంలో ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం టారిఫ్ విధిస్తానని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెలలో గ్రహం యాక్ట్‌ను కూడా అమెరికా కాంగ్రెస్‌లో పాస్ చేశారు. అయితే ఆ చట్టం అమలు చేయడానికి 30 రోజుల గడువు సమీపించడంతో.. ట్రంప్ అనూహ్యంగా ఆ చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దేశ ప్రయోజనాలను ఉద్దేశించి ఆంక్షలను…
ఆదేశాలకు సంబంధించిన సర్టిఫికేట్‌ను అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 16వ తేదీన గ్రహం యాక్ట్‌ను పాస్ చేశారు. రెండు రోజుల తర్వాత ఆ యాక్ట్‌ను చట్టంగా మారుస్తూ ట్రంప్ సంతకం చేశారు. అయితే ఆ చట్టం ప్రకారం రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న దేశాలపై వంద శాతం టారిఫ్ విధించాలనుకున్నారు. కానీ చట్టం అమలులోకి రావడానికి 30 రోజుల గడవు దగ్గరపడడంతో.. అనూహ్యంగా ట్రంప్ ఆ యాక్ట్‌ను రద్దు చేశారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/national/donadl-trump-waives-russia-related-us-sanctions-that-threatened-100-tariffs-on-india-china-2538524
framing not published · 10 outlets covered this story, below the floor for a split