Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Donald Trump : ఇరాన్ (Iran) పై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ఆరోపణ చేశారు. గత ఎనిమిది నెలల కాలంలో ఇరాన్ ప్రభుత్వం (Iran Govt) 75 వేల మంది నిరసనకారులను చంపేసిందని ఆరోపించారు. అమెరికా (USA) లో వచ్చే నెలలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు.
ఇరాన్ను ఉద్దేశించి ట్రంప్ ఏమన్నారంటే.. ‘వారు ఎన్నో హత్యలు చేశారు. కనీసం 75 వేలమంది నిరసనకారులను చంపేశారు. అక్కడి ప్రజలు ఎందుకు నిరసనలు చేయడం లేదని నాతో కొందరు అన్నారు. వీధి చివరన మెషిన్ గన్లతో కాల్పులు జరుపుతుంటే నిరసనలు కష్టమే కదా..! అంతేగాక ఇరాన్ ప్రభుత్వం చంపేసిన వారిని అందరూ చూసేలా క్రేన్లకు వేలాడదీస్తున్నది. అది చాలా విచారకరం’ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/international/trump-accuses-iran-of-killing-75000-says-asking-nato-for-help-during-war-was-test-2540764
framing not published · 1 outlet covered this story, below the floor for a split