ఎల్నినో ఎఫెక్ట్: పశువుల మేత కష్టాలతో సెంచరీ దాటిన లీటరు పాలు!
V6 Velugu · V6 Velugu · 2 min read at V6 Velugu
ఇండియాలో పాలు నిత్యవసర వస్తువు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ పోషకాహారంగా నిలిచే పాలు ప్రస్తుతం సామాన్యులకు భారంగా మారుతోంది. మహారాష్ట్రలోని భివాండి ప్రాంతంలో స్థానిక పాడి రైతుల అమ్మే తాజా పాలు లీటరుకు దాదాపు రూ.100కి చేరుకోవడం ప్రజల బడ్జెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పండుగ సీజన్లో డిమాండ్ పెరుగుతుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
వినియోగదారులు ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ.. పాడి రైతుల వైపు నుంచి చూస్తే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పశువుల మేత, దాణా, ఎండుగడ్డి, పశువుల కొనుగోలు ధరలు విపరీతంగా పెరగడమే ఈ సంక్షోధానికి ప్రధాన కారణమని భివాండి తాలూకా మిల్క్ ప్రొడ్యూసర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ గాడ్గే తెలిపారు. గత 20-25 రోజుల్లోనే పశుదాణా ధరలు చుక్కలను తాకాయి. ఆయిల్ కేక్ ధర రూ. 38-40 నుంచి రూ. 50కి, చుని ధర రూ. 30-32 నుంచి రూ. 40కి పెరిగింది. అలాగే ఎండుగడ్డి, వరి గడ్డి, జొన్న-సజ్జ కాడల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇక ఆవుల రేటు రూ.లక్ష పైబడి, గేదె రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు చేరడంతో రైతులపై…
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/milk-prices-reach-100-liter-in-bhiwandi-amid-el-nino-impact-and-fodder-crisis
framing not published · 1 outlet covered this story, below the floor for a split