Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Namasthe Telangana · NT News telugu · 2 min read at Namasthe Telangana
Elon Musk | ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. అమెరికాలోని ప్రతి చిన్నారికి వచ్చే ఏడాది స్పేస్ఎక్స్లో ఒక షేర్ ఇస్తానని ప్రకటించారు. సోమవారం తన ఎక్స్ (X) ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ షేర్ల పంపిణీ ఎలా జరుగుతుంది? ఏ వయసు పిల్లలకు ఇస్తారు? అర్హతలు ఏమిటి? వంటి వివరాలను మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.
కృత్రిమ మేధ (AI) రంగంలో పనిచేస్తున్న ఆంత్రోపిక్ సంస్థ తన షేర్లలో కనీసం ఐదు శాతాన్ని ప్రజాప్రయోజనాల కోసం ఏర్పాటు చేసే నిధికి కేటాయించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ప్రైవేట్ కంపెనీగా దాని తాజా విలువ ఆధారంగా ఈ వాటా సుమారు 48 బిలియన్ డాలర్లకు సమానం. లాభాపేక్షలేని సంస్థలకు విరాళాలు ఇవ్వడం, ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారికి సహాయం చేయడం వంటి కార్యక్రమాలకు ఈ నిధిని వినియోగించే అవకాశం ఉంది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/international/elon-musk-says-he-will-give-a-spacex-share-to-every-child-in-america-2540378
framing not published · 1 outlet covered this story, below the floor for a split