‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
– బీఆర్ఎస్వీ ఎంజీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వాడపల్లి నవీన్
రామగిరి, అక్టోబర్ 19 : తెలంగాణ ప్రభుత్వం జీఓ నంబర్ 142 ద్వారా చేపట్టనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి ఒక్క పోస్టు కూడా కేటాయించకపోవడం అన్యాయమని బీఆర్ఎస్వీ ఎంజీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వాడపల్లి నవీన్ విమర్శించారు. ఎంజీయూకు అధ్యాపక పోస్టులు కేటాయించకపోవడంతో విశ్వవిద్యాలయంలో ఇప్పటికే ఉన్న అధ్యాపకుల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలతో సమానంగా ఎంజీయూకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/nalgonda/govt-must-respond-to-the-shortage-of-faculty-members-at-mgu-2540154
framing not published · 2 outlets covered this story, below the floor for a split