ఏపీ స్థానిక ఎన్నికల నామినేషన్లలో ఉద్రిక్తత
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల మొదటి రోజే వైసీపీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య దాడులు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరు నామినేషన్ కేంద్రానికి వైసీపీ అభ్యర్థుల తరపున నామినేషన్లు దాఖలు చేసేందుకు వైసీపీ లోక్‌సభ పక్షనేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, నేతలు అక్కడికి వెళ్లారు. మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడిచేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్‌ఎన్‌కాలనీలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వైసీపీ…
ఈ ఘటనలో 15 కార్లు ధ్వంసమవ్వగా, నాలుగు వాహనాలు కాలిపోయాయి. గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆఫీస్ లోపలే ఉన్నారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తిరుపతిలో మేయర్ ఎన్నికల నామినేషన్ల కేంద్రాల వద్ద ఘర్షణ చోటుచేసుకున్నది. కొర్లగుంట, బైరాగిపట్టెడ ప్రాంతాల్లో వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ వద్ద స్వల్ప ఘర్షణ వాతావరణం కనిపించింది. ఈ క్రమంలో పరిస్థితి తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ఐజీ జిల్లాల ఎస్పీలతో అత్యవసర సమీక్ష నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘర్షణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదికలు కోరింది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/andhrapradesh-news/violence-erupts-during-local-body-election-nominations-in-andhra-pradesh-2538300
framing not published · 1 outlet covered this story, below the floor for a split