ఏపీలో హాయర్ రూ.7 వేల కోట్ల పెట్టుబడి ..21 వేల మందికి ఉద్యోగాలు
V6 Velugu · V6 Velugu · 1 min read at V6 Velugu
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ తయారీ కంపెనీ హాయర్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడికి సిద్ధమైంది. రూ.7 వేల కోట్లతో ఏపీలో కొత్త తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఇండియాలో కంపెనీకి ఇదే అతిపెద్ద పెట్టుబడి. ఇప్పటికే మహారాష్ట్రలోని పుణే, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలలో తయారీ ప్లాంట్లు నిర్వహిస్తున్న ఈ సంస్థ, తాజా పెట్టుబడితో దక్షిణాదిలోకి అడుగుపెట్టనుంది.
ఈ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో 250 ఎకరాల భూమిని కేటాయించింది. రెండు దశల్లో (తొలి దశలో రూ.4,500 కోట్లు, రెండో దశలో రూ.2,500 కోట్లు) 2032 నాటికి ఈ పెట్టుబడులను పూర్తి చేస్తారు. తొలి దశ తయారీ కేంద్రం 2028 నాటికి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశముంది. ఈ ప్లాంట్ ద్వారా 6 వేల మందికి ప్రత్యక్షంగా, 15 వేల మందికి పరోక్షంగా.. మొత్తంగా 21 వేల మందికి ఉపాధి లభించనుంది.
Excerpt. Full story at V6 Velugu: https://www.v6velugu.com/haier-india-to-invest-rs-7000-crore-in-andhra-pradesh-generate-21000-jobs
framing not published · 1 outlet covered this story, below the floor for a split