ఏపీలో స్థానిక సమరం.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఇదే! - Visalaandhra
Visalaandhra · Shanthi · 2 min read at Visalaandhra
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ నోటిఫికేషన్తో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 663 జెడ్పీటీసీలు, 9,859…
ఎన్నికల షెడ్యూల్ వివరాలుప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ నెల అక్టోబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానాలకు ఎన్నికల ప్రకటన జారీ చేస్తారు. అదే రోజు ఓటర్ల జాబితాను కూడా ప్రదర్శిస్తారు. నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. పరిశీలన, అప్పీళ్లు: అక్టోబర్ 24న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యర్థులు అప్పీలు చేసుకునేందుకు అక్టోబర్ 25 వరకు గడువు ఉంటుంది. ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డీఓకు, జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా…
Excerpt. Full story at Visalaandhra: https://visalaandhra.com/local-body-battle-in-ap-here-is-the-schedule-for-zptc-and-mptc-elections
framing not published · 11 outlets covered this story, below the floor for a split