Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Fake Number Plates | సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత కఠినతరం చేయడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నకిలీ, ఫోర్జరీ, మార్పులు చేసిన, అనధికారిక రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను ప్రదర్శించే వాహనాలపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ చేపట్టారు. వాహన గుర్తింపును దాచడం, ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడం, చట్టబద్దమైన నిబంధనలను ఉల్లంఘించడం కోసం నకిలీ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌ను చేపట్టామని పోలీసులు తెలిపారు.
గత 8నెలల కాలంలో మొత్తం 100 క్రిమినల్ కేసులు నమోదు చేసి, 100 వాహనాలను సీజ్ చేశారు. సీజ్ అయిన వాహనాల్లో 88 టూవీలర్స్, 12 ఫోర్‌వీలర్స్ ఉన్నాయి. ట్రాఫిక్ సిబ్బంది ఇటువంటి ఉల్లంఘనలను గుర్తించడానికి నిరంతరం నిఘా ఉంచుతుందని, ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం హెచ్ఎస్ఆర్పీ నిబంధనలకు అనుగుణంగా ప్రతీ వాహనదారుడు తమ నంబర్ప్లేట్లను అమర్చుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/hyderabad/tg-police-focus-on-fake-car-number-plets-2540577
framing not published · 1 outlet covered this story, below the floor for a split