France protests: ఫ్రాన్స్ అల్లర్లలో.. తీవ్రవాద భావజాలం ఉన్న అమెరికన్లు..
Eenadu · Eenadu · 2 min read at Eenadu
ఇంటర్నెట్ డెస్క్: ధరల పెరుగుదల, దుర్భరమైన జీవనవ్యయం వంటి సమస్యలపై నిరసన ప్రదర్శనల (France Protests) సందర్భంగా ఫ్రాన్స్‌లోని సిటీహాళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలు, వేలాది వాణిజ్య సంస్థలపై ఉద్యమకారులు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూలు విధించాల్సి వచ్చింది. అయినప్పటికీ అల్లర్లు ఏమాత్రం ఆగట్లేదు. తీవ్రమవుతున్న ఈ ఆందోళనల్లో చేరడానికి అమెరికా నుంచి పలువురు యాక్టివిస్టులు, తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు (US radicals) ప్యారిస్‌కు వెళ్లినట్లు అగ్రరాజ్యానికి చెందిన పలు మీడియా సంస్థలు సంచలన కథనాలను వెలువరించాయి.
వాటి ప్రకారం.. అల్లర్లలో పాల్గొనడానికి మిన్నెసోటా నుంచి ఓ ర్యాపర్ ఇటీవల ఫ్రాన్స్‌కు వెళ్లారు. అంతటితో ఆగకుండా ప్యారిస్‌లో బీభత్సం సృష్టించాలని సోషల్ మీడియా వేదికగా శ్వేతజాతీయులకు పిలుపునిచ్చారు. అమెరికాలోనూ ఇటువంటి నిరసనలు లేవనెత్తాల్సిన అవసరం ఉందని అతడు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికాకు చెందిన కోడ్ పింక్ అనే సంస్థ ఫ్రాన్స్‌ను ఆదర్శంగా తీసుకొని అగ్రరాజ్యంలోనూ ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 10నుంచి 12మధ్య వాషింగ్టన్లో ‘పన్ను చెల్లింపుదారుల తిరుగుబాటు’ నిర్వహించనున్నట్లు పేర్కొంది.
Excerpt. Full story at Eenadu: https://www.eenadu.net/telugu-news/world/us-radicals-join-in-france-protests/0801/126190755
framing not published · 1 outlet covered this story, below the floor for a split