France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
France Protests : ఫ్రాన్స్ (France) లో పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా నిరసనలు (Protests) కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనల్లో భాగంగా నిరసనకారులు 143 ఏళ్ల నాటి చారిత్రక లిమోజెస్ టౌన్‌హాల్ (Limoges Town Hall) భవనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో భవనం చాలావరకు ధ్వంసమైంది. ఈ భవనాన్ని 1873 నుంచి నిర్మించారు. నిర్మాణం పూర్తవడంతో 1883లో అధికారికంగా ప్రారంభించారు.
లిమోజెస్ టౌన్‌హాల్ భవనం ఫ్రాన్స్‌లో చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. ఇవాళ ముసుగులు ధరించిన కొందరు ఆందోళనకారులు ఆ భవనానికి నిప్పుపెట్టి ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మంటల కారణంగా భవనం పైకప్పు పూర్తిగా కూలిపోయిందని, బయటి భాగంలో మూడింట రెండొంతులు ధ్వంసమైందని వెల్లడించారు. ఇది దేశ వారసత్వ సంపదకు జరిగిన ఘోర విపత్తు అని స్థానిక ప్రిఫెక్ట్ మారిస్ బరేట్ ఆవేదన వ్యక్తంచేశారు. దుండగులు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డారని బరేట్ పేర్కొన్నారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/international/thousands-on-streets-over-rising-living-costs-poor-services-mini-french-revolution-what-went-wrong-2539432
framing not published · 2 outlets covered this story, below the floor for a split