Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Free Data Engineering Course | హనుమకొండ, అక్టోబర్ 18:తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు శ్రీ సత్యసాయి దక్షత కార్యక్రమం పూర్తిగా ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తోంది. డేటా ఇంజినీరింగ్ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పట్టభద్రులకు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
2022 నుంచి 2026 మధ్య ఎమ్మెస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన పట్టభద్రులు ఈ శిక్షణకు అర్హులు. తరగతులు హైదరాబాద్లోని ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు. మూడు దశాబ్దాల బోధనా అనుభవం ఉన్న అధ్యాపకులు అభ్యర్థులకు శిక్షణ అందించనున్నారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/sri-satya-sai-dakshata-offering-free-data-engineering-course-for-telangana-unemployed-youth-2539516
framing not published · 1 outlet covered this story, below the floor for a split