Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
Ghee Benefits | నెయ్యి.. ఆహారానికే కాదు, అందానికీ మెరుగులు అద్దుతుంది. ముఖ్యంగా.. చర్మ సంరక్షణలో దివ్యంగా పనిచేస్తుంది. నిత్యం యవ్వనంగా కనిపించేందుకు సాయపడుతుంది. ప్రతిరోజూ భోజనానికి ముందు ఒక చెంచా నెయ్యి తీసుకుంటే.. చర్మంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.
చర్మం యవ్వనంగా కనిపించాలని, ముడతలు తగ్గించుకోవాలని.. యాంటి ఏజింగ్ ఉత్పత్తులకు వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. కానీ, నెయ్యి.. సహజంగానే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే నెయ్యి.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీర్ఘకాలంలో చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఎలాంటి సింథటిక్ ఉత్పత్తులను ఉపయోగించకుండానే.. చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా, కాంతిమంతంగా మార్చేస్తుంది.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/health/does-ghee-help-keep-your-skin-young-and-glowing-2540869
framing not published · 1 outlet covered this story, below the floor for a split