గోడలకు సున్నాలేసేటోడు.. ప్రజలకు సున్నం పెడ్తుండు
Namasthe Telangana · NT News telugu · 1 min read at Namasthe Telangana
తిరుమలగిరి అక్టోబర్ 1 : గోడలకు సున్నాలేసేటోడు.. నేడు ప్రజలకు సున్నం పెడ్తుండు.. అని ‘సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ధ్వజమెత్తారు. పేదోడు సీఎం కుర్చీలో ఉంటే ఓరుస్తలేరని, పేద కుటుంబంలోనుంచి, నల్లమల అడవుల్లోంచి వచ్చిన అని చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి అసలు తనెవరో తనకే క్లారిటీ ఉందా అని ఎద్దేవాచేశారు. గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సిరిసిల్ల సభ దండయాత్ర లెక్కలేదు,.. దండు పాళ్యం బ్యాచ్ కలిసి యాత్ర చేసినట్టుగా ఉన్నదని’ ఎద్దేవాచేశారు. కేటీఆర్ కాలిగోటికి కూడా రేవంత్‌రెడ్డి…
ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు మానుకొని, ఇచ్చిన హమీలు అమలు చేయాలని సూచించారు. సిరిసిల్లలో కేటీఆర్‌పై గెలిచిన అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తానన్న రేవంత్ ఎంత దైన్యమైన పరిస్థితిలో ఉన్నాడో ఆలోచించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లకు సూచించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలని గాదరి కిశోర్ పిలుపునిచ్చారు.
Excerpt. Full story at Namasthe Telangana: https://www.ntnews.com/telangana/gadari-kishore-criticizes-cm-revanth-reddy-over-unfulfilled-promises-2525276
framing not published · 1 outlet covered this story, below the floor for a split